అక్షరటుడే, కామారెడ్డి: ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా కామారెడ్డి ఎమ్మెల్యే గురువారం వారణాసికి వెళ్లారు. కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. గత పదేళ్ల కాలంలో వారణాసి పట్టణాన్ని, కాశీ విశ్వనాథ ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో అభివృద్ధి చేశారని ఎమ్మెల్యే తెలిపారు. కాశీ విశ్వనాథున్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.