అక్షరటుడే, కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ బీఆర్ఎస్ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 32వ వార్డు కౌన్సిలర్ అనూష భర్త ప్రసన్న కుమార్ ఆదివారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, అందుకే ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరినట్లు ప్రసన్న కుమార్ తెలిపారు. మరికొన్ని గంటల్లో కామారెడ్డి చైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియ జరగనుంది. ఈ నేపథ్యంలోనే పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.