అక్షరటుడే, కామారెడ్డి టౌన్: డబుల్ బెడ్ రూం కాలనీలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో గల డబుల్ బెడ్ రూమ్ కాలనీ పరిశీలించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలు, ఇంకా చేపట్టాల్సిన పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. గత ఆరు నెలలుగా డబుల్ బెడ్ రూం కాలనీలో మురికి కాల్వలను శుభ్రం చేయాలని కోరగా వెంటనే స్పందించినట్లు తెలిపారు. దోమల నివారణకు చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ సుజాత వార్డ్ కౌన్సిలర్ జహీరా బేగం యామిన్, మానస ప్రసాద్, పాత శివ కృష్ణమూర్తి, చాట్ల వంశీ, రవి గౌడ్, ఇల్లందుల లతా వేణు పాల్గొన్నారు.