అక్షరటుడే, కామారెడ్డి టౌన్: చేనేత వస్త్రాలను ఆదరించి ప్రోత్సహించాలని కామారెడ్డి మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇందుప్రియ పిలుపునిచ్చారు. బుధవారం అంతర్జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పట్టణంలో జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ మున్సిపల్ ఆఫీస్ నుంచి రోటరీ క్లబ్ వరకు సాగింది. ఈ సందర్భంగా ఛైర్ పర్సన్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వారంలో ఒక్క రోజైనా చేనేత వస్త్రాలను ధరించి నేతలను ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు చాట్ల రాజేశ్వర్, సిరిగాద లక్ష్మీనర్సింలు, చేనేత సంఘం ప్రతినిధులు, జిల్లా పద్మశాలి సంఘం ప్రతినిధులు బొమ్మెర రాజయ్య, సబ్బని ధర్మపురి, సబ్బని కృష్ణ హరి, సబ్బని రాములు, మాడి పెద్ది వెంకటి, దేవనపల్లి రవి, గుండా హరినాథ్, కాముని హరి తదితరులు పాల్గొన్నారు.