అక్షర టుడే, కామారెడ్డి : జిల్లాలో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు చేస్తామని జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. కామారెడ్డి జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని అక్టోబర్ 1 నుంచి 7వ తేదీ వరకు పాటు జిల్లా వ్యాప్తంగా 30,30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని పేర్కొన్నారు. పోలీసు అధికారుల అనుమతి లేకుండా జిల్లా ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని సూచించారు.