అక్షర టుడే, కామారెడ్డి: విధి నిర్వహణలో ఉత్తమ పనితీరుతోనే ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుందని ఎస్పీ సింధుశర్మ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో హెడ్ కానిస్టేబుల్ కాశయ్య ఉద్యోగ విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీతో పాటు పలువురు ఆయన్ను సన్మానించారు. అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ జార్జ్, ఆర్‌ఎస్సైలు నవీన్, సంతోష్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.