అక్షరటుడే, కామారెడ్డి: పట్టణంలోని పాత నేషనల్ హైవే-7 రోడ్డుకు ఇరువైపులా ఉన్న వివిధ షాపుల వారితో సీసీ కెమెరాల ఏర్పాటుపై గురువారం కామారెడ్డి టౌన్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరు తప్పకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సీఐ సూచించారు. సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు తమవంతుగా సహాయం చేస్తామని సీఐకి వారు తెలిపారు. ఈ సందర్భంగా వారికి సీఐ కృతజ్ఞతలు తెలిపారు.