అక్షరటుడే, కామారెడ్డి: పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం పెట్రోలింగ్ బైక్‌లను అందుబాటులోకి తెచ్చినట్లు కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. బుధవారం వాహనాలను సీఐ ప్రారంభించారు. జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అశోక్ నగర్, స్నేహపురి కాలనీ, శ్రీరాంనగర్, వివేకానంద కాలనీ, శ్రీనివాస్ నగర్ కాలనీలను కలుపుకొని ఈ సిబ్బంది రెండు షిఫ్ట్ లలో అందుబాటులో ఉంటారని చెప్పారు.