అక్షరటుడే, వెబ్​డెస్క్​: వచ్చే ఐదేళ్లలో కేరళలో రూ. 30,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ పేర్కొన్నారు. కేరళలోని కొచ్చిలో జరిగిన ఇన్వెస్ట్​ కేరళ గ్లోబల్​ సమ్మిట్-​‌‌2025లో ఆయన మాట్లాడారు. త్రివేండ్రం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రూ. 5,500 కోట్లతో 4.5 మిలియన్ల నుంచి 12 మిలియన్ల ప్రయాణికుల సామర్థ్యంగా విస్తరిస్తామన్నారు. కొచ్చిలో లాజిస్టిక్స్, ఇ-కామర్స్ హబ్‌ను కూడా ఏర్పాటు చేస్తామని ఉద్ఘాటించారు. కొచ్చిలో అదానీ సిమెంట్స్​ సామర్థ్యాన్ని కూడా పెంచుతామని సమ్మిట్​లో వివరించారు.