అక్షరటుడే, ఇందూరు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 13న ఉమ్మడి జిల్లాస్థాయి కరాటే పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్‌జీఎఫ్ కార్యదర్శి నాగమణి తెలిపారు. అండర్ -14, 17 విభాగాల్లో బాల బాలికలకు ఆయా వెయిట్ కేటగిరీల్లో పోటీలు ఉంటాయన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు కామారెడ్డి జిల్లా దోమకొండలోని ముదిరాజ్ ఫంక్షన్ హాల్‌లో ఉదయం 10 గంటలకు రిపోర్ట్ చేయాలని సూచించారు.