అక్షరటుడే, వెబ్‌డెస్క్: హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై దురుసుగా ప్రవర్తించారని ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన అధికారిక సమావేశంలో గందరగోళం సృష్టించారని RDO మహేశ్వర్ ఫిర్యాదు ఇవ్వగా మరో కేసు పెట్టారు. అలాగే దాడికి యత్నించారని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుపై మూడో కేసు నమోదు చేశారు. కాగా.. త్వరలోనే కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.