అక్షరటుడే, వెబ్డెస్క్: ఢిల్లీ ఎన్నికల్లో ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని కేజ్రీవాల్ పేర్కొన్నారు. శనివారం ఎన్నికల ఫలితాల అనంతరం వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదేళ్లలో పేదల సంక్షేమానికి విశేష కృషి చేశామన్నారు. ఇప్పటి నుంచి బలమైన ప్రతిపక్ష పార్టీగా నిలబడి ప్రజలతో నడుస్తామన్నారు. తుదివరకు ఎన్నికల్లో పోరాడిన ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు.