అక్షరటుడే, ఇందూరు: నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయంలో ఒకటో తరగతికి అదనపు సెక్షన్ మంజూరు చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయమై ఎంపీ ధర్మపురి అరవింద్ హర్షం వ్యక్తం చేశారు. వీఎంసీ కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు గతంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసి ఇందుకు అనుమతి ఇవ్వాలని ఎంపీ అరవింద్ కోరారు. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. తాజాగా అదనపు సెక్షన్ మంజూరు చేస్తూ కేంద్రీయ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది అడ్మిషన్ల కోసం మొత్తం 132 దరఖాస్తులు వచ్చాయి. నిబంధనల ప్రకారం లాటరీ పద్ధతిలో అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు విద్యాలయ అధికారులు వెల్లడించారు. కాగా వీఎంసీ సభ్యులు, తల్లిదండ్రులు ఎంపీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.