అక్షరటుడే, కామారెడ్డి: దోమకొండ మండలంలోని సీతారంపల్లి కేజీబీవీ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు వీణ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గురువారం తన ఇంట్లో సూసైడ్ అటెంప్ట్ చేయగా వెంటనే ఆమెను కుటుంబీకులు కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. తనను పాఠశాల ఎస్‌వో మానసికంగా వేధిస్తున్నారని ఘటనకు ముందు బాధితురాలు వాట్సప్ స్టేటస్ పెట్టుకున్నట్లు కుటుంబీకుల ద్వారా తెలిసింది. స్టాఫ్, స్టూడెంట్స్ ఎవరూ తనతో మాట్లాడకుండా ఎస్‌వో ఇబ్బంది పెడుతోందని, అధికారులకు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని స్టేటస్ లో బాధితురాలు పేర్కొంది.