అక్షరటుడే, వెబ్​డెస్క్​: రాష్ట్రంలో ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్​ ఛైర్మన్​ కోదండరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వేసవి సమీపిస్తుండటంతో పలు ప్రాంతాల్లో నీరందక పంటలు ఎండుతున్నాయని తెలిపారు. పంటలను కాపాడుకోవడానికి అప్పులు చేసి బోర్లు వేయొద్దని ఆయన రైతులకు సూచించారు. నీరు ఉంటేనే పంటలు వేసుకోవాలన్నారు. రైతులను ఇబ్బంది పెట్టేలా రాజకీయ నాయకులు ప్రకటనలు చేయొద్దని ఆయన కోరారు.