అక్షరటుడే, బాన్సువాడ: కోటగిరి మండలం కొత్తపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు కారం అన్నం పెట్టిన ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. పాఠశాల హెచ్‌ఎం కిషన్‌పై సస్పెన్షన్ వేటు వేశారు. అంతేకాకుండా ఇద్దరు టీచర్లకు మెమోలు జారీ చేశారు. పాఠశాలలో ఇటీవల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో భాగంగా కారం అన్నం వడ్డించిన ఘటన వెలుగుచూసిన విషయం తెలిసిందే. దీనిపై పలు పత్రికల్లో వార్తలు వెలువడడంతో పాటు సంబంధిత ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించారు. విచారణ చేపట్టాలని డీఈవో దుర్గాప్రసాద్ ను ఆదేశించారు. దీంతో ఆయన రెండ్రోజుల కిందట విచారణ చేపట్టారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాలనుసారం ఈమేరకు చర్యలు తీసుకున్నారు.