అక్షరటుడే, ఆర్మూర్‌: మండలంలోని మంథని గ్రామంలో వీడీసీ ఆధ్వర్యంలో సోమవారం కృష్ణాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పాండురంగ ఆలయం వద్ద పూజలు జరిపి ఉట్టి కొట్టే కార్యక్రమం ప్రారంభించారు. అనాదిగా నిర్వహిస్తున్న గోపాల కాల్వల్లో గ్రామపెద్దలు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. వేడుకల్లో వీడీసీ సభ్యులు భూపతిరెడ్డి, నారాయణ, శ్రీనివాస్‌ రెడ్డి, మల్లయ్య, లింబారెడ్డి, ప్రవీణ్‌ యాదవ్, రమేశ్ యాదవ్, శ్రీనివాస్, గంగారెడ్డి, ముత్యంరెడ్డి, సురేష్, పెర్కిట్‌ లింబారెడ్డి, ప్రతాప్, సంజీవ్‌ తదితరులు పాల్గొన్నారు.