అక్షరటుడే, వెబ్‌డెస్క్: రేవంత్‌రెడ్డి ఓ మూర్ఖుడని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను ఎవరు తిట్టినా ఇలాగే మాట్లాడుతానని ఆయన పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. 2014లో తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పుడు దేశంలో పదోస్థానంలో ఉందన్నారు. అనంతరం బీఆర్ఎస్ పాలనలో నంబర్‌వన్ స్థానంలో నిలిచిందని నివేదికలే చెబుతున్నాయన్నారు. సాక్షాత్తు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెలువరించిన నివేదికలోనే ఈ వాస్తవాలు ఉన్నాయన్నారు. ఇప్పటికైనా కేసీఆర్‌ను తిట్టడాన్ని మానేయాలని రేవంత్‌రెడ్డిని హెచ్చరించారు.