అక్షరటుడే, ఇందూరు: జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ కుంచం శ్రీనివాస్‌కు డాక్టరేట్ వరించింది. ఈ మేరకు గ్లోబల్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని సారస్వత పరిషత్‌లో కార్యక్రమం నిర్వహించారు. శ్రీలంక యూత్ పార్లమెంట్ విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి, అంతర్జాతీయ దౌత్యవేత్తల అధ్యక్షుడు అహ్మద్ సాదిక్ చేతుల మీదుగా శ్రీనివాస్ డాక్టరేట్ అందుకున్నారు. కార్మికులు, బడుగు, బలహీన వర్గాల పక్షాన అనేక వార్తా కథనాలతో జాగృత పర్చినందుకు గాను గ్లోబల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎక్స్లెన్స్ అవార్డు అందించినట్లు ట్రస్ట్ ఛైర్మన్ రెహమాన్ తెలిపారు.