అక్షరటుడే, వెబ్‌డెస్క్: పార్లమెంట్ సమావేశాలు సజావుగా నడపాలని కోరుకుంటున్నామని లోకసభ ప్రతిపక్షనేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. స్పీకర్ ఓం బిర్లాతో బుధవారం రాహుల్‌గాంధీ సమావేశమయ్యారు. శీతకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీలు తనపై చేసిన అవమానకర వ్యాఖ్యలను తొలగించాలని స్పీకర్‌ను కోరారు. ఈ విషయాన్ని పరిశీలిస్తానని స్పీకర్ తెలిపారని విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ వెల్లడించారు. బీజేపీ నేతలు ప్రతిపక్షాలపై ఆరోపణలు గుప్పిస్తూనే ఉంటారన్నారు. సభలో చర్చ జరిగితే నిజాలు బయటకు వస్తాయన్నారు. డిసెంబర్ 13న రాజ్యాంగంపై చర్చ జరిగేలా తాము కోరుకుంటున్నామని పేర్కొన్నారు.