అక్షరటుడే, నిజామాబాద్‌ సిటీ: నగరంలోని వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్‌ నాయకుడు అదే ప్రవీణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్‌ షబ్బీర్‌ అలీ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ లో చేరిన వారిలో బీజేవైఎం నాయకుడు పాశకంటి మహేష్‌, బీఆర్‌ఎస్‌ 25వ డివిజన్‌ ఇన్‌ఛార్జి తుమ్మ నాగభూషణం తదితరులున్నారు. కార్యక్రమంలో నుడా ఛైర్మన్ కేశ వేణు, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు నరాల రత్నాకర్‌, ఈర్ల శేఖర్‌, సయ్యద్‌ రహీం తదితరులు పాల్గొన్నారు.