అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: దేశంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీల్లో ప్రాంగణ నియామకాలు కొనసాగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఐఐటీ మద్రాస్‌ విద్యార్థికి, ప్రముఖ వాల్‌ స్ట్రీట్‌ ట్రేడింగ్ సంస్థ జెన్‌ స్ట్రీట్‌ అత్యధికంగా రూ.4.3కోట్ల ప్యాకేజీని ఆఫర్‌ చేసింది. బ్లాక్‌ రాక్‌, గ్లీన్‌, డావెన్సీ వంటి సంస్థలు విద్యార్థులకు రూ.2కోట్ల ప్యాకేజీలను ఆఫర్‌ చేస్తున్నాయి. ఏపీటీ పోర్ట్‌ పోలియో, రుబ్రిక్‌ రూ.1.4కోట్లకు పైగా ప్యాకేజీలను ప్రకటిస్తున్నాయి.

ఖరగ్‌పూర్‌ ఐఐటీ స్టూడెంట్ కు రూ.2.14కోట్లు

ఖరగ్‌పూర్‌లో ఐఐటీలో మొదటి రోజే 750 మంది ఉద్యోగాలను సొంతం చేసుకున్నారు. ఇక్కడ ఇప్పటివరకు అందించిన అత్యధిక ప్యాకేజీ రూ.2.14కోట్లు. 11 మంది విద్యార్థులు రూ.కోటికి పైగా ప్యాకేజీని సొంతం చేసుకున్నారు. తొమ్మిది మంది అంతర్జాతీయ ఆఫర్లను అందుకున్నారు. ఈ ప్రాంగణ నియామకాల్లో ఆపిల్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అన్న క్యాపిటల్‌ వన్‌ వంటి కంపెనీలు పాల్గొన్నాయి.