అక్షరటుడే, ఆర్మూర్: మండలంలోని ఫతేపూర్ గ్రామ ఊర చెరువుకు పాత తూము వద్ద గండి పడింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువు నిండుకుండలా మారింది. చెరువులో నీరు అధికం కావడంతో తూముకు గండి పడగా జేసీబీ సహాయంతో పూడ్చేశారు.