అక్షరటుడే, వెబ్ డెస్క్: నగర శివారులోని ముబారక్ నగర్లో గల సాయి అటాకరి హైట్స్ అపార్ట్మెంట్లో లిఫ్టులో చిన్నారులు ఇరుక్కుపోయిన ఘటన కలకలం రేపింది. మూడో అంతస్తు నుంచి కిందికి దిగే క్రమంలో లిఫ్టులో ఉన్న నలుగురు చిన్నారులు అందులో ఇరుక్కుపోయారు. గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా.. అపార్ట్మెంట్ వాసులు ఉలిక్కిపడ్డారు. అనంతరం వారిని క్షేమంగా బయటకు తీశారు. ఈ సందర్భంగా అపార్ట్మెంట్ వాసులు మాట్లాడుతూ.. బిల్డర్ నాసిరకం పనులు చేయడం వల్లే తాము ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఆరు నెలల కిందటే లిఫ్టు ఏర్పాటు చేశారని, నాణ్యత లోపం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు.
.