కేకే వై రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు

0

అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట మండలంలోని కేకే వై రహదారిపై తరచుగా ప్రమాదాలు జరుగుతున్న స్థలాన్ని బుధవారం సీఐ రవీందర్ నాయక్ ,ఆర్ అండ్ బీ ఏఈ రవితేజ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేకే వై రహదారిపై జేఎన్ఆర్ గార్డెన్స్ సమీపంలో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాహనాలు నడిపే సమయంలో తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గరీబ్ ఉన్నిసా బేగం, ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఫతియోద్దీన్, తదితరులు పాల్గొన్నారు