ఎలుగుబంటి సంచారం.. భయం గుప్పిట్లో తండా వాసులు

Advertisement

అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట మండలం చింతలగుట్ట తండా పరిసరాల్లో ఎలుగుబంటి సంచరించడంతో తండా వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ సందర్భంగా తండా వాసులు మాట్లాడుతూ.. గత వారం రోజులుగా రోజూ ఎలుగుబంటి తండా సమీపంలోని కుంటలోకి వస్తుందన్నారు. కుంట పక్క నుంచే తండాకు దారి ఉందని, ఆ మార్గం వెంట ప్రయాణించాలంటే ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సి వస్తుందని వాపోయారు. అటవీ శాఖ అధికారులు స్పందించి ఎలుగుబంటి తండాలోకి రాకుండా చూడాలని కోరారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Bodhan | వాహనం ఢీకొని జింక మృతి

Advertisement