అక్షరటుడే, ఎల్లారెడ్డి: గంజాయి పండించి, విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు లింగంపేట పోలీసులు. నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడికి తరలించారు. ఎస్సై సుధాకర్ కథనం ప్రకారం.. పక్కా సమాచారం మేరకు రెక్కీ నిర్వహించి లింగంపేట మండలం రాంపల్లి తండాకు చెందిన కిషన్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 1.3 కిలోల ఎండు గంజాయి, రెండు ద్విచక్ర వాహనాలు, ఆరు చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే గంజాయి వినియోగిస్తున్న బాయంపల్లికి చెందిన అంబెం సతీష్, పొట్లల్ల పాల్ ఆస్టిన్(కొర్పల్), పిడ్తల శ్రీకాంత్(కామారెడ్డి), బట్టు సాయికృష్ణ, ఇంద్రసేనారెడ్డి(అడ్లూరు ఎల్లారెడ్డి)లను సైతం అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడికి తరలించినట్లు ఎస్సై వివరించారు.