అక్షరటుడే, జుక్కల్: నిజాంసాగర్ మండల కేంద్రంలోని హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు వినియోగదారుల నుంచి అదనపు దోపిడీకి పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ ధర రూ. 874 కాగా.. ఒక్కొక్కరి నుంచి డెలివరీ ఛార్జీల పేరిట రూ.50కి పైగా అదనంగా వసూలు చేస్తున్నారని తెలిపారు. అదనపు వసూళ్లపై ప్రశ్నిస్తే సిలిండర్ల సరఫరాలో జాప్యం చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ విషయమై స్థానిక రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. తహశీల్దార్ బిక్షపతిని వివరణ కోరగా.. గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులను పిలిచి విచారణ జరుపుతానని చెప్పారు. అదనపు వసూళ్లు చేసినట్లు గుర్తిస్తే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.