అక్షరటుడే, ఆర్మూర్: నందిపేట మండల కేంద్రంలో సోమవారం పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. పది మందిపై దాడి చేసి గాయపరిచాయి. కుక్కల దాడిలో రామ్ చరణ్ అనే విద్యార్థి, దొడ్డి సాయిలు, లసుం బాయ్, సతీష్ కుమార్ తదితరులు గాయపడ్డారు. వీరిలో లసుంబాయ్ కి తీవ్ర గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం నందిపేట ఆస్పత్రికి తరలించారు.