అక్షరటుడే, వెబ్డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీగౌడ్ ఢిల్లీలో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చించినట్లు సమాచారం. కులగణన సర్వేకు సంబంధించిన పలు అంశాలపై, సర్వేపై ప్రజల్లో వస్తున్న స్పందనను మధుయాష్కీ రాహుల్ గాంధీకి వివరించినట్లు తెలిసింది.