అక్షరటుడే, ఇందూరు: ఎస్సీ రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం వర్గీకరించాలని మాదిగ జాతి సంఘం నిజామాబాద్ కన్వీనర్ తెడ్డు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మాదిగలకు రావాల్సిన 10శాతం రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికన కేటాయించాలని కోరుతూ ఏకసభ్య కమిషన్ ఛైర్మన్‌కు లేఖ రాశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కమిటీ సభ్యులు రాజు, సంతోష్, రమేశ్, సాయినాథ్, వినోద్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.