అక్షరటుడే, బిచ్కుంద: ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో కేబినెట్‌ ఆమోదం తెలపడంపై మాదిగ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం మండలకేంద్రంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఎంతో కృషి చేశారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు రమేశ్​, తుకారాం, చందు, గంగాధర్, నాగనాథ్, బిచ్కుంద మండలాధ్యక్షుడు గంగాధర్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.