అక్షరటుడే, బిచ్కుంద: సైబర్ మోసగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని మద్నూర్ ఎస్సై విజయ్ కొండ సూచించారు. మద్నూర్ మండలంలోని దోతి గ్రామంలో స్వచ్ఛంద సేవాసంస్థ సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్మిషన్ ఆధ్వర్యంలో శనివారం గ్రామస్థులకు అవగాహన కల్పించారు. అనంతరం ఆర్బీఐ క్యాలెండర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌టీ కౌన్సిలర్ ముఖేష్, రవికుమార్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.