అక్షరటుడే, వెబ్​డెస్క్: యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈ నెల 23న మహా కుంభాభిషేకం నిర్వహించనున్నారు. ఆలయ గోపురానికి బంగారు తాపడం చేసిన సందర్భంగా మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్​ నేపథ్యంలో అనుమతి కోసం ఆలయ అధికారులు ఈసీకి లేఖ రాశారు.