అక్షరటుడే, ఆర్మూర్: పట్టణంలోని నవనాథ సిద్దుల గుట్టను గురువారం మహబూబాబాద్​ ఎమ్మెల్యే మురళి నాయక్ భూక్య దర్శించుకున్నారు. గుహలోని శివలింగం, రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ వినయ్ రెడ్డి, ఏఎంసీ ఛైర్మన్​ సాయిబాబా గౌడ్, జంబి హనుమాన్ ఆలయ ఛైర్మన్​ రేగుళ్ల సత్యనారాయణ, వెంకటరామిరెడ్డి, కొంతం మురళి, చిట్టి రెడ్డి, జిమ్మీ రవి ఉన్నారు.