అక్షరటుడే, వెబ్డెస్క్: మహబూబ్నగర్ డీఈవో రవీందర్ ఏసీబీకి చిక్కారు. ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటుండగా గురువారం అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సీనియార్టీ గురించి ఒక ఉపాధ్యాయుడు డీఈవోను కోరగా ఆయన రూ.50 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు ఉపాధ్యాయుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచన మేరకు గురువారం మహబూబ్నగర్లో డీఈవోకు లంచం ఇస్తుండగా డీఎస్పీ కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో అధికారులు పట్టుకున్నారు.