అక్షరటుడే, ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్‌గా మహేష్ కుమార్ పదవీ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన నిజామాబాద్ నగరపాలక సంస్థలో శానిటరీ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తూ పదోన్నతిపై ఎల్లారెడ్డికి వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న శ్రీహరి రాజు పదోన్నతిపై బాన్సువాడ మున్సిపల్ కమిషనర్‌గా వెళ్లారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్ మహేశ్‌కుమార్ మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.