అక్షరటుడే, వెబ్​డెస్క్​: పరీక్ష సెంటర్​ మారడంతో విద్యార్థిని అయోమయంలో ఉండగా మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు మానవత్వం చూపారు. వివరాల్లోకి వెళ్తే.. సోషల్​ వెల్ఫేర్ పరీక్ష రాసేందుకు ఓ బాలిక తన తల్లితో మహేశ్వరం వచ్చింది. అయితే తన సెంటర్​ కందుకూరు అని తెలియడంతో ఆందోళన చెందింది. దీంతో అక్కడే విధుల్లో ఉన్న మహేశ్వరం సీఐ తన వాహనంలో తల్లీకూతుళ్లను కందుకూరు పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లారు. సీఐకి మహిళ కృతజ్ఞతలు తెలియజేశారు.