అక్షరటుడే, వెబ్‌డెస్క్: పేదల భూములు కబ్జా చేశారనే ఆరోపణలతో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటలరాజేందర్ ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై చేయి చేసుకున్నాడు. మేడ్చల్ జిల్లా పోచారంలోని ఏకశిలానగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మంగళవారం అక్కడ పర్యటించిన ఈటలకు స్థానికులు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు పేదల స్థలాలను కబ్జాచేశారని తెలిపారు. దీంతో ఆయన వెళ్లి ప్రశ్నించారు. ఈ క్రమంలో ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై చేయి చేసుకున్నాడు. పేదలపై దౌర్జన్యం చేస్తే ఊరుకునేది లేదన్నారు. అధికారులు బ్రోకర్లకు కొమ్ము కాస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. దొంగ కాగితాలు సృష్టించిన అధికారులను జైల్లో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.