అక్షరటుడే, బాన్సువాడ: బీడీ కార్మికులకు షరతుల్లేకుండా రూ. 4వేల జీవన భృతి అందించాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశ్ డిమాండ్ చేశారు. వర్ని మండల కేంద్రంలో బీడీ కార్మికులతో శుక్రవారం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో భూమేశ్, మేఘన, గంగామణి, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.