అక్షరటుడే, జుక్కల్: మద్నూర్ మార్కెట్ కమిటీలో ఏర్పాటు చేసిన సోయా కొనుగోలు కేంద్రాన్ని మండల వ్యవసాయ అధికారి రాజు మంగళవారం పరిశీలించారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు కాంట చేయాలని సూచించారు. అన్ని గ్రామాల రైతులు ఒకేసారి సోయాలను కేంద్రానికి తీసుకురాకుండా గ్రామాల వారీగా చెప్పిన తేదీల్లో రావాలని కోరారు. రైతులు సోయాలను తీసుకు వచ్చేటప్పుడు ఏఈవోల వద్ద టోకెన్ రాయించుకోవాలని సూచించారు. సొసైటీ సీఈవో బాబురావ్, ఏఈవోలు సౌమ్య, అనిల్, భాజన్న పాల్గొన్నారు.