అక్షరటుడే, భిక్కనూరు: మండల కేంద్రానికి చెందిన మన్నే సిద్ధరాములు ఎంఎస్ఎన్ కంపెనీలో పనిచేసేవాడు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో తోటి సిబ్బంది అతని కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు. కార్యక్రమంలో ఇన్​ఛార్జిలు చిరంజీవి, గంగిరెడ్డి, గంగల యాదగిరి, ఇస్కాన్ పేట సుధాకర్, అజయ్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.