అక్షరటుడే, ఎల్లారెడ్డి: మండల కేంద్రానికి చెందిన పలువురు అయ్యప్ప మాలదారులు మంగళవారం శబరిమలకు తరలివెళ్లారు. స్థానిక హరిహర అయ్యప్ప క్షేత్రం నుంచి ఇరుముడి కట్టుకుని ప్రత్యేక వాహనంలో అయ్యప్ప దర్శనానికి బయలుదేరారు. ఈ సందర్భంగా వారికి కుటుంబ సభ్యులు, స్వాములు వీడ్కోలు పలికారు.