అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్‌: రోడ్డు ప్రమాదంలో నగర మేయర్‌ నీతూకిరణ్‌ భర్తకు దండు శేఖర్‌కు తీవ్రగాయాలయ్యాయి. నగరంలోని నాగారం ప్రాంతంలో సోమవారం బైకుపై వెళ్తుండగా అదుపు తప్పి పడిపోయాడు. దీంతో ఆయన తలకు గాయాలయ్యాయి. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. ఒక ఆటోవాలా దండు శేఖర్‌పై దాడి చేసినట్లు ప్రచారం జరుగుతోంది.