అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: మెడికల్‌, పీజీ విద్యార్థులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. తెలంగాణలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ చదివిన వాళ్లను స్థానికులుగానే పరిగణిస్తూ తీర్పు ఇచ్చింది. గతంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఈ విద్యార్థులను స్థానికులుగా గుర్తించవద్దంటూ జీవో తీసుకొచ్చింది. దీనిపై విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు వారికి అనుకూలంగా తీర్పు వెలువరించింది.