అక్షరటుడే, బాన్సువాడ: పోతంగల్ ఆయుర్వేద వైద్యశాలలో గురువారం వృద్ధులకు వైద్య శిబిరం నిర్వహించారు. ఆయుష్ విభాగం జిల్లా ఇన్‌చార్జి నారాయణరావు మాట్లాడుతూ.. వృద్ధాప్య వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చర్మ వ్యాధులు, కీళ్ల నొప్పులు, అర్శమొలలు, మలబద్ధకం, రక్తపోటు, మధుమేహం తదితర వ్యాధులకు చికిత్స చేసి ఉచితంగా మందులు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయుర్వేద వైద్యురాలు ఆకుల రాధిక కళ్యాణ్, వైద్యులు వెంకటేశ్, కరణ్, శ్రావ్య, ఫార్మాసిస్టులు పురుషోత్తం, సాఫియా, సుజాత, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.