అక్షరటుడే, బాన్సువాడ: పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్మికులకు వేతన బకాయిలు చెల్లించాలని మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్, ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సబ్ కలెక్టర్ కిరణ్మయికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆస్పత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ కార్మికులకు నాలుగు నెలల వేతనాలు చెల్లించాలని, విధుల నుంచి తొలగించిన ఇద్దరు కార్మికులను తిరిగి తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు రాములు, గంగాధర్, రాములు, సంతోష్ గౌడ్, రేణుక, సురేఖ, గంగారం, కళ్యాణి, లక్ష్మణ్, సంగీత, కాశీరాం, సాయిలు పాల్గొన్నారు.