అక్షరటుడే నిజాంసాగర్: కుష్టు వ్యాధి నియంత్రణకు ప్రతిఒక్కరూ చర్యలు తీసుకోవాలంటూ వైద్యశాఖ అధికారి సాయిలు సూచించారు. నిజాంసాగర్ మండలంలోని మల్లూరులోని పంచాయతీ కార్యాలయంలో కుష్టు వ్యాధి నియంత్రణపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కుష్టు సోకిన వారిని చేరదీయాలన్నారు. అనంతరం గ్రామస్తులు, మహిళా సంఘాల సభ్యులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. స్థానిక పాఠశాలలో విద్యార్థులకు కుష్టు వ్యాధిపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సంతోష్, ఏఎన్ఎం లక్ష్మి ఉన్నారు.