అక్షరటుడే, ఇందూరు: నగరంలోని బాపూజీ వచనాలయ కార్యదర్శిగా ఎన్నికైన మీసాల సుధాకర్‌రావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బాపూజీ వచనాలయంలో అధ్యక్షుడు భక్తవత్సలం అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్‌బిన్‌ హందాన్‌, నుడా ఛైర్మన్ కేశ వేణు, రైతు సంక్షేమ కమిటీ సభ్యుడు గడుగు గంగాధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రాజారెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో వచనాలయం కోశాధికారి గంగాధర్‌ రావు, ఉపాధ్యక్షుడు దేవిదాస్, అశోక్, సంయుక్త కార్యదర్శులు సాంబయ్య, దత్తాత్రి, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.