అక్షరటుడే, బాన్సువాడ: తెలంగాణ మలిదశ ఉద్యమకారులకు ప్రకటించిన హామీలు అమలు చేయాలని బాన్సువాడ మలిదశ ఉద్యమకారుల ఫోరం సభ్యులు డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో మాట్లాడారు. 250 గజాల స్థలం, ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో ఉద్యమకారులు గంగాధర్, సాయిబాబా, చందు, విజయ్, భీమానాయక్, కృష్ణ, భాస్కర్ గౌడ్, సాయికుమార్, మహేష్, మారుతి, సురేష్ పాల్గొన్నారు.